Telangana

పట్టభద్రులు కాంగ్రెస్ వైపే నీలం మధు ముదిరాజ్

ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రైవేట్ రంగంలో వేల మందికి ఉపాధి కల్పన

యువతకు నైపుణ్యాల కల్పనకు స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు పట్టం కట్టండి

కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రతిక్షణం నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఒక ఏడాదిలోనే 56వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపే పట్టబద్రులు ఉన్నారని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అశోక్ నగర్ సితార గ్రాండ్ లో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారితో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. గత పది ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన నిరుద్యోగులకు పెద్దపీటవేస్తూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే 56వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నిరుద్యోగులకు భరోసా గా నిలబడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.

ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పన మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని నిరుద్యోగులు గమనించాలన్నారు. గత నెలలో దావోస్ వేదికగా జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు రూ. ఒక లక్ష అరవై అయిదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. ప్రైవేట్ రంగంలో యువతకు మెరుగైన వృత్తి నైపుణ్యాలను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పి అత్యుత్తమ ప్రమాణాలతో వివిధ రంగాలలో శిక్షణ అందిస్తుందన్నారు.

దానికి తోడు విద్యార్థి దశ నుంచే నైపుణ్యాలు పొందేలా ప్రతి నియోజకవర్గానికి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నెలకొల్పి అత్యుత్తమ విద్యను అందించే విధంగా కృషి చేస్తుందన్నారు. తెలంగాణలోని పట్టబద్రులు చైతన్యవంతులని తమకు అన్ని విధాల న్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి సేవలను వారు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

గ్రాడ్యుయేట్ ఓటర్లంతా ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంకుంట అంక్షారెడ్డి , ప్రధాన కార్యదర్శులు రఘురాం శివాంత్ రెడ్డి, షామిలి, పట్టభద్రులు,పటాన్చెరు నియోజకవర్గ మున్సిపల్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,మహిళా కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

3 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

15 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

15 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

15 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

15 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago