Districts

గీతం స్కాలర్ శివజ్యోతికి డాక్టరేట్

మన వార్తలు ,పటాన్ చెరు:

ఎంపిక చేసిన ఔషధాలలో మలినాలను నిర్ణయించే పద్ధతుల కచ్చితత్వం పెంపు, ధ్రువీకరణ అనే అంశంపై అధ్యయనం, విశ్లేషణ, దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్‌చెరు సమావేశంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని శివజ్యోతి నర్రెడ్డిని డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.వెంకట నారాయణ బుధవారం వెల్లడించారు. ఉత్పత్తి నాణ్యత, భద్రత, సమర్థతను నిర్ణయించడంలో ఔషధ పరిశ్రమలో విశ్లేషణాత్మక పద్ధతులు ముఖ్య భూమిక పోషిస్తాయని తెలిపారు. ఈ పరిశోధనలో హెఫైనేటెడ్ పద్ధతులను ఉపయోగించి విశ్లేషణాత్మక పద్ధతులు అభివృద్ధి చేశామన్నారు.

బాగా మెరుగుపరచిన ఈ పద్ధతులు సరళమైనవి, అత్యంత ఖచ్చితమైనవి, కఠినమైనవి, తక్కువ సమయంలో ధ్రువీకరించుకోవచ్చని తెలిపారు. మరింత మెరుగైన విశ్లేషణాత్మక విధానం సాధారణ పరీక్షలు, నియంత్రణ మార్కెట్లలో శీఘ్ర ఉత్పత్తిని ప్రారంభించే సామర్థ్యాన్ని పెంచుతాయన్నారు. ఈ విధానం డోలుటెగ్రావిర్, లామివుడిన్, అలాజానావిర్, నిర్దాగ్లిస్టిన్ వంటి ఔషధాలకు అన్వయించినట్టు ఆయన వివరించారు. శివజ్యోతి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్‌డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, పలువురు విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు అభినందించినట్టు పేర్కొన్నారు.

Ramesh

Recent Posts

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

1 hour ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

2 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

2 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

2 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

1 day ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

1 day ago