Hyderabad

నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

మనవార్తలు , శేరిలింగంపల్లి :

కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా తీసుకుని మిగతా కాలనీ వారు ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ రాయుడు, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ మద్దిలేటి యాదవ్, సంతోష్ శంకర్, కాంలని వాసులు ఎం ఎస్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, బసవ శంకర్, మోహన్ రావు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 110 కెమెరాలు విలువ 22 లక్షలు ప్రస్తుతం 50 కెమెరాలు 10 లక్షలు ఖర్చు అయినది మిగిలిన 60 కెమెరాల కు 12 లక్షలు త్వరలో మిగిలిన 60 కెమెరాల ఏర్పాటు చేస్తామని కాలనీ వాసులు తెలిపారు.

సి సి కెమెరాల ఏర్పాటు కు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన వెంకట రాజు, భగవాన్ దాస్, రామ్మూర్తి, రామ సుబ్బారెడ్డి మరియు వారి మిత్రులు అందరు కలిసి 10 లక్షల రూపాయలు సహాయం చేసిన వారికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago