Telangana

గీతం స్కాలర్ సంధ్యకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని సి.సంధ్యను డాక్టరేట్ వరించింది, ‘సర్యావరణ, జీవసంబంధ అనువర్తనాల కోసం మెటల్, మెటల్ ఆక్సెడ్ సూక్ష్మ-సమ్మేళనాలు’ అనే అంశంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట నాగేంద్ర కుమార్ పుట్టా శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లోని సీఎస్ ఐఆర్-ఐఐసీటీ చీఫ్ సెంటిస్ట్ (రిటెర్డ్) ప్రొఫెసర్ శ్రీధర్ బొజ్జా బాహ్య పరిశీలకుడిగా వ్యవహరించినట్టు తెలిపారు.సంధ్య తన సంచలనాత్మక సిద్ధాంత వ్యాసంలో, మొక్కల సారాలను ఉపయోగించి మెటల్, మెటల్ ఆక్సెడ్, మెబల్ ఫెర్రెట్ట్ సూక్ష్మ-సమ్మేళనాలను సంశ్లేషణ చేయడంలో పర్యావరణ హిత రసాయన సూత్రాల వినూత్న అనువర్తనాలను అన్వేషించినట్టు పేర్కొన్నారు. ఈ అధ్యయనం పర్యావరణ, జీవసంబంధమైన రంగాలలో స్థిరమైన విధానాలు, వాటి అనువర్తనాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతోందన్నారు.వివిధ మొక్కల మూలాల నుంచి నానో-సమ్మేళనాల ఆకుసచ్చ సంశ్లేషణను ప్రస్పుటం చేస్తుందని, వాటి ఎంపిక, సున్నితత్వం, బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ బయోసింథసెజ్డ్ పదార్థాలు విషపదార్థాలను తొలగిస్తాయని, ఉత్ప్రేరక, బయోమెడికల్ రంగాలలో బాగా ఉపయోగపడతాయని ఈ పరిశోధనలో తేలిందన్నారు.సంధ్య సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీఏవీఎస్ఆర్ నర్మ, సలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

19 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

1 day ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

1 day ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

1 day ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

1 day ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago