పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్మార్ట్ ఐడియా థాన్ (అత్యుత్తమ అవిష్కరణలు చేసిన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం) గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంతో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. స్టార్టప్ ఇండియా, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ (సీఈఎం), బోస్టన్ లోని నార్త్ ఈస్ట్రన్: యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్ (ఎన్ఎయూసీఈఈ)ల సహకారంతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల కార్యక్రమ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఏంజెల్స్ చైర్మన్ రాజేష్ మంతెన, ఆత్మీయ అతిథిగా కంట్రోల్ ఎస్ క్వాలిటీ- ప్రొక్యూర్ మెంట్ హెడ్ చంద్రశేఖర్ శర్మ గరిమెళ్ల పాల్గొన్నారు. యువత జీవితంలో రాణించడానికి ఉపకరించే ప్రాథమిక అంశాలైన ఉత్సుకత, ధైర్యం, శీలం, భావప్రకటనా నైపుణ్యాల గురించి రాజేష్ మంతెన వివరించారు. ఎప్పటికప్పుడు మారుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో నిరంతరం నేర్చుకునే ఉత్సుకత ఉండాలని, అప్పుడే వృద్ధితో పాటు అనుభవాన్ని కూడా గడిస్తామన్నారు. విద్యతో పాటు కళలు, సంగీతం, భౌతిక, జీవశాస్త్రం వంటి విభిన్న రంగాలతో కూడా నైపుణ్యం గడించడం ఉత్తమమని చెప్పారు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదని, భయం కంటే ముఖ్యమైనది మరొకటి ఉందన్నారు. భయం ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లడం, నిర్ణయాత్మక శక్తిగా ఎదగడాన్ని సూపర్ సవర్ గా ఆయన అభివర్ణించారు.
సంక్లిష్టమైన పరిస్థితులను విశ్లేషించడం ద్వారా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సహోద్యోగులను గౌరవించాలని, చక్కగా వినడం, దీర్ఘదృష్టితో యోచించాలని రాజేష్ ఔత్సాహిక వ్యవస్థాపకులకు సలహా ఇచ్చారు. దయగా, మర్యాదగా, ఉదారంగా, నైతికంగా ఉండడమే అభివృద్ధి చెందడానికి సులువైన మార్గనున్నారు. భావ ప్రకటనా నైపుణ్యం ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెబుతూ, దానిని నిరంతర సాధనతో అలవరచుకోవాలని చెప్పారు. తనదైన శైలితో ఎంపిక చేసుకున్న రంగాలలో రాణించాలని రాజేష్ మంతెన సూచించారు. ఆత్మీయ అతిథి చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ, రాబడి అధికంగా ఉండే వాటిలో నూతన ఆవిష్కరణలు చేయాలని చెప్పడంతో పాటు కంట్రోల్ ఎస్ గురించి, దాని సేవలను వివరించారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ప్రారంభోపన్యాసం చేయగా, ఏడీసీ డిప్యూటీ డెరైక్టర్ ఫకృద్దీన్ షేక్ అతిథులను స్వాగతించారు.
నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గ్రెగ్ కొల్లియర్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ రవి రామమూర్తి, గీతం చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ క్రిస్ సంగెగడ్డ, వీడీసీ డెరైక్టర్ డి.శ్రీదేవి తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకలు ముగిశాక, ఉన్నత విద్యా సంస్థలలోని విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగే వాతావరణాన్ని ఎలా సృష్టించాలి” అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సున్నిత సుందర్, వీహబ్ డెరైక్టర్ (వ్యూహం- భాగస్వామ్యం) సృజన చదలవాడ, ఐఎస్టిలోని ఐ-వెంచర్ అసోసియేట్ నెస్ట్ ప్రెసిడెంట్ సురేష్ కృష్ణ, ఐటీఐసీ ధృవ్ గుప్తాలు ఈ చర్చలో పాల్గొన్నారు.ఆహారం, ఆరోగ్యం, స్టెమ్ కోసం బొమ్మలు, స్థిరమైన ఫ్యాషన్, పొదుపుగా ఉండే ఆవిష్కరణ అనే నాలుగు ఇతివృత్తాలుగా నిర్వహిస్తున్న ఈ పోటీలలో దేశం నలుమూలల నుంచి 1,007 దరఖాస్తులు రాగా, వాటిలో 310 ఆహారం, ఆరోగ్యంపై, 76 స్టెమ్ కోసం బొమ్మలు, 135 స్థిరమైన ఫ్యాషన్ కు చెందినవి కాగా, గరిష్ఠంగా 489 దరఖాస్తులు పొదుపుగా ఉండే ఆవిష్కరణకు సంబంధించినది. అనేక వడపోతల తరువాత 32 జట్లను సెమీ ఫైనల్స్ కు ఎంపిక చేయగా, గురువారం ప్రజెంటేషన్లు పూర్తయ్యాక ఎనిమిది జట్లను తుది పోరుకు ఎంపిక చేశారు. అందులో అత్యుత్తమంగా నిలిచిన జట్టుకు రెండు లక్షల రూపాయల నగదు పురస్కారం, ద్వితీయ స్థానం పొందినవారికి లక్ష రూపాయలు ఇచ్చి సత్కరించనున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…