మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కమిటీ అధ్యక్షుడు మల్లేశం నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలు స్థానిక భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.నవరాత్రులలో భాగంగా తొమ్మిదవ రోజున మల్లేశం తన కుటుంబ సభ్యులు మరియు బస్తీవాసులతో కలసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం దాదాపు 500 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ”గణపతి స్వామివారి దివ్య ఆశీస్సులతో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ లంబోదరుని కృపతో పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతినగర్ బస్తీవాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలను దిగ్విజయం చేశారు.
-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్ -అభినందించిన జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…
పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…
గీతం మహిళా సాధికారిత సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని…