Telangana

వైభవంగా గణనాథుడి నిమజ్జనం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న ‘యూరో కిడ్స్ స్కూల్’ ప్రాంగణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. స్కూల్ చైర్మన్ గాదె మహేష్, సంజన మహేష్ ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మరియు మట్టి విగ్రహాల ప్రాముఖ్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా స్కూల్ ప్రాంగణంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించినట్లు తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించామని, ప్రతిరోజూ స్కూల్ తరఫున అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు వివరించారు.​ఉత్సవాల చివరి రోజున విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం “జై బోలో గణేష్ మహరాజ్ కీ జై” అంటూ నినాదాలతో గణనాథుడిని నిమజ్జనానికి సాగనంపారు.ఈ వేడుకల్లో యూరో కిడ్స్ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

admin

Recent Posts

వెల్ డన్ యాదగిరి ..!

-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్  -అభినందించిన జిల్లా కలెక్టర్   శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…

1 hour ago

హైదరాబాద్‌లో తొలి స్టోర్‌తో భారత్‌లోకి అడుగుపెట్టిన కెల్లీ ఫెల్డర్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…

1 hour ago

కంట్రీ క్లబ్ నవ్రాత్రి బాష్ 2026కు శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…

1 hour ago

గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపయ్య ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…

1 hour ago

నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…

2 hours ago

వీ హబ్ ను సందర్శించిన గీతం విద్యార్థినులు

గీతం మహిళా సాధికారిత సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని…

2 hours ago