Telangana

కంట్రీ క్లబ్ నవ్రాత్రి బాష్ 2026కు శ్రీకారం

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజాల కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ హేమ శర్మ, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ – తెలంగాణ హసిత నారాయణభట్ట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గర్బా, డాండియా ప్రదర్శన ఆకట్టుకుంది. గర్బా, డాండియా, సంగీతం, పండుగ సంబరాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నామని, అదే సమయంలో 2030 నాటికి 10 లక్షల మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీని నిర్మించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నామని రాజీవ్ రెడ్డి తెలిపారు.

సంప్రదాయ నవరాత్రి స్ఫూర్తిని గర్బా, డాండియా, సంగీతం, వినోదంతో కలిపి ఆధునిక వేడుకల అనుభూతిని అందిస్తోందని, హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని కంట్రీ క్లబ్స్ లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.2030 నాటికి 10 లక్షల మంది సభ్యులను చేరుకోవాలనే లక్ష్యానికి స్పష్టమైన వ్యూహం ఉందని, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా క్లబ్‌లు, ఫిట్‌నెస్, హాలిడేస్, వివిధ అనుభవాలను ఆస్వాదించేలా ఒక సమగ్ర ఎకోసిస్టమ్‌ను రూపొందించాలనేది లక్ష్యం ముందుకు వెళ్తున్నామన్నారు.

ఇప్పటికే ఉన్న, కొత్త సభ్యులకు మరింత విలువైన సేవలను అందించేందుకు 500 కొలాబొరేటెడ్ క్లబ్‌లు, 1,000 ఫిట్‌నెస్ సెంటర్లు, దేశీయ మరియు అంతర్జాతీయంగా 1,000 హాలిడే డెస్టినేషన్లను  అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజీవ్ రెడ్డి తెలిపారు.

అదే సమయంలో CCIP (Country Club Entrepreneur Program)ను పునరుద్ధరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీని ద్వారా వ్యక్తులు తమ సొంత వ్యాపారాన్ని నిర్మించుకుని, తమకు తామే బాస్‌గా ఎదుగుతూ, కంట్రీ క్లబ్ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములుగా వ్యాపార అవకాశాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.

‘Rel-event’ ఎండీ సందీప్ కుమార్ చందా మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుండి 20 వరకు బేగంపేటలోని విశాలమైన పోలీస్ హాకీ స్టేడియంలో జరగనున్న 10 రోజుల బహిరంగ వేడుక ‘నవరాత్రి ఉత్సవ్ దాండియా నైట్స్’ ఒక అద్భుతమైన వేడుకగా నిలవనుందని తెలిపారు.

admin

Recent Posts

వెల్ డన్ యాదగిరి ..!

-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్  -అభినందించిన జిల్లా కలెక్టర్   శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…

1 hour ago

హైదరాబాద్‌లో తొలి స్టోర్‌తో భారత్‌లోకి అడుగుపెట్టిన కెల్లీ ఫెల్డర్

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…

1 hour ago

గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపయ్య ఉత్సవాలు

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…

1 hour ago

వైభవంగా గణనాథుడి నిమజ్జనం

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…

2 hours ago

నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…

2 hours ago

వీ హబ్ ను సందర్శించిన గీతం విద్యార్థినులు

గీతం మహిళా సాధికారిత సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు వ్యవస్థాపకత, స్టార్టప్ లపై అవగాహన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని…

2 hours ago