పటాన్‌చెరులో కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ పనులకు శంకుస్థాపన..
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో భాగంగా నియోజకవర్గం వ్యాప్తంగా నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని పంచముఖి హనుమాన్ దేవాలయం ఎదురుగా నూతనంగా నిర్మించ తలపెట్టిన కన్యకా పరమేశ్వరి దేవాలయం నిర్మాణ పనులకు ఆదివారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ భక్తి భావం పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 220 కి పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…