మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :
నగరంలో దంత వైద్య రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ “ప్రియాంకాస్ ఇన్ఫినిట్ స్మైల్స్” క్లినిక్ ఘనంగా ప్రారంభమైంది. ప్రీమియం, పేషెంట్-ఫస్ట్, డెంటల్ డెస్టినేషన్, బ్లెండ్స్ కట్టింగ్-ఎడ్జ్ లాంటి అత్యాధునిక AI సాంకేతికత, నిపుణుల వైద్య పరిజ్ఞానం మరియు అత్యుత్తమ సేవలను ఒకే చోట ఈ క్లినిక్ అందిస్తోంది.ప్రముఖ దంత వైద్య నిపుణురాలు డా. ప్రియాంక స్థాపించిన ఈ క్లినిక్, ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇక్కడ అధునాతన కాస్మెటిక్ డెంటిస్ట్రీ, స్మైల్ మేకోవర్స్, రిస్టోరేటివ్ ట్రీట్మెంట్స్, పిల్లల దంత వైద్యం, ప్రివెంటివ్ కేర్ వంటి విభిన్న సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి పేషెంట్ కి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడం ఈ క్లినిక్ ప్రత్యేకత.
ఈ సందర్భంగా డా. ప్రియాంక మాట్లాడుతూ “ప్రియాంకాస్ ఇన్ఫినిట్ స్మైల్స్ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదు — నమ్మకం, సౌకర్యం, ఆత్మవిశ్వాసం కలిగించే అనుభవం. ప్రతి పేషెంట్ ప్రత్యేక శ్రద్ద తో, అందమైన చిరునవ్వుతో బయటకు వెళ్లేలా చేయడం మా లక్ష్యం” అని అన్నారు.హైదరాబాద్‌లోని లాంకో హిల్స్, మణికొండ వద్ద ఈ డెంటల్ క్లినిక్‌లో అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల శుభ్రత నియమాలు, పేషెంట్ సౌకర్యం మరియు గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే ప్రత్యేక డిజైన్ కలిగి ఉంది. ఖచ్చితత్వం, అందం మరియు దీర్ఘకాలిక దంత ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ, ఈ క్లినిక్ ప్రాంతంలో కొత్త ప్రమాణాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది అని నిర్వహకులు తెలిపారు.ఈ కార్యక్రమం లో రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ మిశ్రా, మెహర్ రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సింగర్ స్మిత, మరికొంతమంది ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…