Telangana

గీతం సైన్స్ కోర్సుల అడ్మిషన్ల కోసం మే 17న ప్రవేశ పరీక్ష

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం మే 17న గీతం అడ్మిషన్ టెస్ట్ (గాట్-2026, మూడో దశ)ను నిర్వహించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 14వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్ లైన్లో సమర్పించవచ్చని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రెజా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.యూజీసీ గుర్తింపుతో పాటు నాక్ ఏ++ గ్రేడ్ తో అక్రిడిటేషన్ పొందిన స్కూల్ ఆఫ్ సైన్స్ అంతర్ విభాగ విద్య, అధునాతన పరిశోధనలకు ఒక అగ్రగామి కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ప్రపంచవ్యాప్త అనుభవం కలిగిన అనుభవజ్జులైన అధ్యాపకుల మద్దతుతో, ఆవిష్కరణ, డీప్-టెక్ పరిశోధన, వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఒక చైతన్యవంతమైన విద్య వాతావరణాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ అందిస్తోందని తెలిపారు.ఈ స్కూల్ యూజీ స్థాయిలో నాలుగు సంవత్సరాల నిడివి గల బీఎస్సీ కోర్సులను అందిస్తోందన్నారు. బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ లో (ఆనర్స్) కోర్సులతో పాటు, మేనేజ్ మెంట్, సోషల్ సైన్సెస్, డేటా సైన్స్, క్వాంటం కంప్యూటింగ్ లో ఫ్లెక్సిబుల్ మైనర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వీటితో పాటు రెండు ప్రధాన వృత్తిపరమైన కోర్సులను కూడా అందజేస్తున్నామన్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, కాగ్నిటివ్ సిస్టమ్స్ (మూడేళ్ల కోర్సు) కంప్యూటింగ్, కాగ్నిటివ్ సైన్సెస్ ను మిళితం చేసే బహుళ విషయక కోర్సని, ఇది కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో పరిశ్రమ డిమాండ్ కు అనుగుణంగా రూపొందించినట్టు తెలిపారు. ఐదేళ్ల నిడివి గల బి-ఆప్టోమెట్రీ కోర్సును ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ సహకారంతో అందిస్తున్నామని, బలమైన క్లినికల్ శిక్షణ, ఉపాధి అవకాశాలతో నైపుణ్యం కలిగిన నేత్ర సంరక్షణ నిపుణులను తయారు చేస్తున్నామన్నారు.ఇక, పీజీ స్థాయిలో, బయెటెక్నాలజీ, కెమిస్ట్రీ (అనలిటికల్, ఆర్గానిక్, ఫార్మాస్యూటికల్ స్పెషలైజేషన్లు), డేటా సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్ (మెటీరియల్ సైన్స్)లో రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సులను అందిస్తున్నట్టు తెలిపారు. ఫెలోషిప్ మద్దతుతో కూడిన ఫుల్-టైమ్ పీహెచ్.డీ. కోర్సులు కూడా పలు విభాగాలలో అందుబాటులో ఉన్నాయన్నారు.

భవిష్యత్తు-కేంద్రీకృత పాఠ్యప్రణాళికను డాక్టర్ రెజా వివరిస్తూ, ప్రపంచ పారిశ్రామిక అవసరాలను తీర్చడానికి డేటా సైన్స్, క్వాంటం సైన్స్ వంటి అధునాతన రంగాలను ఆయా కోర్సులలో పొందుపరిచామని తెలిపారు. విద్యార్థులు ప్రారంభ దశలోనే పరిశోధన అనుభవాన్ని, రెండో ఏడాది నుంచే ఇంటర్న్ షిప్, ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులతో ముఖాముఖితో ప్రయోజనం పొందుతారన్నారు.ఐఐటీ, సీఎస్ఐఆర్, బాబా అణు పరిశోధనా సంస్థ, డీఆర్డీవో వంటి ప్రముఖ సంస్థలతో పాటు డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతో బలమైన సహకారాలను కొనసాగిస్తూ, పటిష్టమైన పరిశోధనా అవకాశాలను, ప్రాంగణ నియామకాలను అందిస్తున్నట్టు ఆయన వివరించారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉపకార వేతనాల (స్కాలర్ షిప్పులు)ను అందిస్తున్నామన్నారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో పొందిన చెల్లుబాటయ్యే స్కోరుతో నేరుగా మే 17న వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావచ్చని తెలిపారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం www.gitam.eduను సందర్శించాలని లేదా హెల్ప్ లైన్ 888 498 4000ను సంప్రదించాలని డాక్టర్ రెజా సూచించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago