శ్రమ దోపిడీ, కుంభకోణాలు చేస్తేనే ఆస్తులు పెరుగుతాయి
మేడే వారోత్సవాల ముగింపు సభలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :
సోషలిజంతోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని టిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీ లోని చిట్కుల్ గ్రామంలోని లక్ష్మీ నగర్ లో మేడే వారోత్సవాలలో భాగంగా శ్రామిక ఉత్సావ కమిటీ ఆ7ధ్వర్యంలో గత రెండు రోజులుగా మహిళలకు, పిల్లలకు నిర్వహిస్తున్న ఆటల ,పోటీల ముగింపు కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ ప్రపంచంలో కష్టపడే కార్మిక వర్గం ఆస్తులు, కష్టజీవుల ఆస్తులు పెరగడం లేదని, శ్రమ దోపిడి చేసే వాళ్లు, కుంభకోణాలు చేసే వాళ్ళ ఆస్తులు మాత్రమే పెరిగిపోతున్నా పెరుగుతాయని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సామెతలు, సూక్తులతోని కష్టజీవులను మభ్యపెడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు. కష్టపడే వాళ్ళ ఆస్తులు పెరిగితే కూలీల, కార్మికుల ఆస్తులు పెరగాలి కదా ఎందుకు పెరగటం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో శ్రమ దోపిడీ చేసే పెట్టుబడుదరుల ఆస్తులు మాత్రమే పెరుగుతున్నాయని ఆయన అన్నారు, మనదేశంలో ఆదాని, అంబానీల ఆస్తులు శ్రమ దోపిడి వల్లనే పెరిగాయని, కుంభకోణాలు చేసే వాళ్ళ ఆస్తులు కూడా పెరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు, కార్మికుల, ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే సోషలిజం లోని అన్ని పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. విద్యా, వైద్యం అందరికీ అందుతుందని, కనీస సౌకర్యాలు అయిన ఇల్లు, గుడ్డ, తిండి కూడా సోషలిజం లోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు, అంతే కాకుండా అన్ని రకాల దోపిడీ నుంచి సోషలిజం లోనే విముక్తి లభిస్తుందన్నారు.ఎంజే,ఈ కార్యక్రమంలో శాంత కుమార్, ఆంజనేయులు ,రాజు, యేసు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…