Telangana

డిజిటల్ హ్యుమానిటీస్ పై అధ్యాపక వికాస కార్యక్రమం

గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం

తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్లం, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ హ్యుమానిటీస్’పై నిర్వహిస్తున్న మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం (ఎఫ్డీపీ) సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. సాంప్రదాయ మానవీయ శాస్త్రాలను (హ్యుమానిటీస్) అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలతో అనుసంధానించే కీలక సాధనాలు – వచనం (టెక్ట్), శ్రవణం (ఆడియో) వంటి వాటిని డిజిటలైజేషన్ చేయడం, మెటాడేటా సృష్టి, నిర్వహణ, డేటా విజువలైజేషన్, టెక్స్ట్ విశ్లేషణలో అధ్యాపక సభ్యులకు ఆచరణాత్మక శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ లక్ష్యం.ప్రారంభ కార్యక్రమంలో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్లు చాలా లోతైన, ఆలోచింపజేసే ప్రసంగాలు చేశారు.

స్కూల్ ఆఫ్ కల్చరల్ టెక్స్ట్ అండ్ రికార్డ్స్ (ఎస్ సీటీఆర్) డైరెక్టర్ ప్రొఫెసర్ అభిజిత్ గుప్తా, డిజిటల్ సంరక్షణలో తన విస్తృత అనుభవాన్ని పంచుకుంటూ డిజిటైజేషన్ చేసి, వాటిని భవిష్యత్తు తరాలకు పనికొచ్చేలా సంరక్షించడం (ఆర్కైవింగ్): ఎస్ సీటీఆర్ ప్రయాణం అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎస్ సీటీఆర్ లోని రిప్రోగ్రాఫర్ డాక్టర్ అమృతేష్ బిశ్వాస్ ‘జ్జానాన్ని సంగ్రహించడం: ఫోటోగ్రఫీ, డిజిటలైజేషన్, డిజిటల్ ఆర్కైవ్ లను నిర్మించడం’, ‘వినగల గతాన్ని కాపాడటం: సౌండ్ ఆర్కైవింగ్, డిజిటలైజేషన్’ అనే అంశాలపై చాలా విలువైన విషయాలను సదస్యులతో పంచుకున్నారు.తొలుత, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ తరు స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.

ఇక రానున్న రెండు రోజులలో ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ అర్జున్ ఘోష్, జాదవ్ పూర్ వర్సిటీ ఎస్ సీటీఆర్ పరిశోధక విద్యార్థిని రీసూమ్ పాల్ వంటి ప్రముఖ వక్తలు తమ నైపుణ్యం, ఆచరణాత్మక అంతర్దృష్టులను పంచుకోనున్నారు. ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వాహకులు డాక్టర్ జోంధలే రాహుల్ హిరామన్, డాక్టర్ బనేకర్ తుషార్ వినాయక్, డాక్టర్ రెస్మి పాడియన్ ల మద్దతుతో డాక్టర్ సయంతన్ మండల్ సమన్వయం చేస్తున్నారు.గత ఏడాది డిజిటల్ హ్యుమానిటీస్ పై నిర్వహించిన అధ్యాపక వికాస కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. డిజిటల్ యుగంలో విద్యా ఆవిష్కరణ, అంతర్ విభాగ నైపుణ్యాలను పెంపొందించడంలో గీతం యొక్క నిరంతర నిబద్ధతను ఈ ఎఫ్డీపీ ప్రతిబింబిస్తోంది.

admin

Recent Posts

గీతంలో అంతర్జాతీయ సదస్సు

జంతు అధ్యయనాల నుంచి ఔషధ ఆవిష్కరణ, అనువాద పరిశోధనపై చర్చ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశంలోని ప్రయోగశాల…

1 week ago

విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ప్రైవేటు పాఠశాలల క్రీడా పోటీలు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత…

2 weeks ago

జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో విశిష్ట వక్తగా గీతం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్…

2 weeks ago

రాష్ట్ర, జాతీయ క్రీడలకు చిరునామా పటాన్ చెరు _ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా కోకో క్రీడలు విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్…

2 weeks ago

మహిళా విద్యకు మార్గదర్శకుడు ఫూలే : నీలం మధు ముదిరాజ్

ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శుక్రవారం జ్యోతిరావు ఫూలే 135వ వర్ధంతి…

2 weeks ago

పటాన్ చెరులో ఘనంగా ప్రారంభమైన అంతర్ జిల్లా రాష్ట్రస్థాయి కోకో క్రీడోత్సవాలు

-లాంచనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ -క్రీడలు, క్రీడాకారులకు సంపూర్ణ సహకారం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థి దశ…

2 weeks ago