Telangana

16 నుండి పటాన్‌చెరు వేదికగా ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు

ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్‌చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా ఈనెల 16 నుండి 18 తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, కబడ్డీ రాష్ట్ర స్థాయి పోటీల ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా టీం అండర్ 14, అండర్ 17 కబడ్డీ బాలుర బాలికల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఆతిథ్యం అందిస్తున్నామని తెలిపారు. 33 జిల్లాల నుండి 400 మంది క్రీడాకారులు, 60 మంది కోచులు, 160 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఈ క్రీడోత్సవాలలో పాల్గొనబోతున్నారని తెలిపారు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా వాలీబాల్ కబడ్డీ అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయని తెలిపారు. 40 లక్షల రూపాయలు సొంత నిధులతో క్రీడోత్సవాల నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు డిఎస్పి ప్రభాకర్, సిఐ వినాయక రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్ జి ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దిన్, ఎల్లయ్య, ప్రమోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

19 hours ago

ప్రమాణాలు పాటించకపోతే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నేరుగా ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…

19 hours ago

ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

21 hours ago

మానవత్వం చాటుకున్న తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లేపల్లి సోమిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్ ఫేజ్-02, 68వ బ్లాక్‌కు చెందిన దాసు ఆకస్మిక…

1 day ago

ఆగస్టు 30న గండిగూడెం గ్రామ దేవతల ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన, ప్రారంభోత్సవం

దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :…

1 day ago

హైలైఫ్ జూవెల్స్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రింన సినీన‌టి కామాక్షి భాస్క‌ర్ల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోని ప్ర‌ముఖ జ్యూవెల‌రీ సంస్థలు వినియోగ‌దారుల కోసం ఒకే వేదిక‌పై బంగారం, వజ్రాలు, ప్లాటినం,…

2 days ago