దయారా జంగంకుంట ఆక్రమణల పై కఠిన చర్యలు
పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి,అమీన్పూర్ :
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాలలో ఆగస్టు 30న ప్రతిష్టాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం ఉదయం స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయంలో దుర్గమ్మ, భూలక్ష్మమ్మ, చిత్తారమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్టించబోతున్నట్లు తెలిపారు. పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ పరిధిలోని జంగంకుంట పరిధిలో ఇటీవల కొందరు మట్టి నింపుతూ ఆక్రమణలకు పాల్పడడంపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దయారా గ్రామస్తులు ఈ అంశం పైన ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా మంగళవారం ఉదయం స్థానికులతో కలిసి కుంటను పరిశీలించారు. కుంటకు ఒక వైపు నుండి మట్టి నింపుతూ అక్రమించేందుకు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడి కుంటను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కుంట పరిరక్షణకు సంపూర్ణ సహకారం అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు రాజు, భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…