Telangana

ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు  పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు కృషి చేస్తున్నామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. చెరువుల బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ పరిధిలోని స్థలాల ఆక్రమణకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.మంగళవారం సాయంత్రం నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గల పోచమ్మ కుంట, అమీన్పూర్ డివిజన్ పరిధిలోని దయారా పరిధిలోని జంగంకుంటల పరిధిలో చెరువు సరిహద్దులను నిర్ణయించి  సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. వడక్పల్లి గ్రామ చెరువు బఫర్ జోన్ పరిధిలో ప్రముఖ నిర్మాణ సంస్థ బఫర్ జోన్ ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించిందని స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగిందని.. వెంటనే దానిని తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తు తరాలకు నీటి వనరులను అందిస్తూ ప్రకృతి సమతుల్యతకు కీలకమైన చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని.. ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, డిఈ బాల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

5 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

6 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

11 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

24 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

24 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

1 day ago