politics

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆసుపత్రి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_కార్మికుల చెంతకు అత్యధునిక వైద్య సేవలు

మనవార్తలు ,రామచంద్రాపురం:

ఆసియాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన ప‌టాన్ చెరునియోజకవర్గంలోని కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులను బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప‌టాన్ చెరు నియోజకవర్గంలో 80% మంది కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారని, వారందరి కోసం ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని రకాల శస్త్ర చికిత్సలతో పాటు, నిపుణులైన వైద్యులు నియమించడం జరిగిందన్నారు.ఆసుపత్రి ఆధునీకరణకు సంపూర్ణ సహకారం అందించిన మంత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వివిధ వైద్య చికిత్సల కోసం కోసం వచ్చే కార్మికులకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించకూడదని వైద్యులను కోరారు.ప్రభుత్వ తరఫున అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.ప‌టాన్ చెరులో ఏర్పాటు చేయబోతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండబోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, టిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago