Telangana

సరితకు డాక్టరేట్ ‘….

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

అల్యూమినియం ఆధారిత మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాల యాంత్రిక , అలసట ప్రవర్తన ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని పి.సరితను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . విమాన నిర్మాణాలలో విస్తృతంగా వినియోగించే 7075 వంటి అల్యూమినియం మిశ్రమాలకు తుప్పు పట్టే అవకాశం ఎక్కువని , ఇది విమాన నిర్మాణ సమగ్రతను ప్రభావితం చేస్తుందని తెలిపారు . ఎందుకంటే , తుప్పు గుంటల నుంచి న్యూక్లియేట్ అయి , ప్రతికూల వాతావరణంలో వేగవంతంగా పెరుగుతాయన్నారు .

దీనివల్ల అనేక ఇంజనీరింగ్ యంత్రాలు , మెకానికల్ భాగాలు హెచ్చుతగ్గుల ఒత్తిడికి లోనవుతాయని , సాపేక్షంగా అధిక పౌనఃపున్యాల వద్ద జరుగుతాయని ఆమె తెలిపారు . ఈ సిద్ధాంత వ్యాసంలో , ఏఎల్ 7075 తో మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాలను బేస్ మెటల్గా , జిర్మోనియం ఉపబలాలను తగు నిష్పత్తిలో వైవిధ్యంగా రూపొందించేందుకు ప్రయత్నించామన్నారు . వాటికి సిలికాన్ కార్బెడ్ , మాలిబ్డినం డెస్టల్నెడ్ స్టెర్డ్ కాస్టింగ్ పద్ధతిని ఉపయోగించి , స్థిరత్వాన్ని కల్పించినట్టు తెలియజేశారు .

సరిత సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago