పటాన్చెరు
నిరు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారము ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 33 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 9 లక్షల 57 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు, కార్మికులు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో మైన మైన వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కాబోతుందని తెలిపారు. అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్న డయాగ్నొస్టిక్ సేవలు ఉచితంగా అందించేందుకు పటాన్చెరు ఏరియా ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ హబ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, కిష్ట రెడ్డి పేట సర్పంచ్ కృష్ణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రారెడ్డి, విజయకుమార్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండలం అధ్యక్షులు పాండు, చంద్రశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు,
సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: రాష్ట్రస్థాయి కబడ్డీ…
5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…
-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…
నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…