పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారికి ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం లభించింది. సంస్థ అధ్యక్ష – ప్రధాన నిర్వాహకుల సంతకంతో కూడిన సభ్యత్వ పత్రం డాక్టర్ కటారికి అందినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో విశ్వవ్యాప్తంగా 50 వేల మంది సభ్యులున్నారని, బ్రిటన్ కేంద్రంగా రసాయన శాస్త్రాభివృద్ధి అది తోడ్పడుతోందని ఆయన తెలిపారు.
శాస్త్రం – మానవత్వాల ప్రయోజనం కోసం దోహదపడే ఈ సంస్థ పరిశోధనలకు పెద్దపీట వేయడమే కాక, పరిశోధనా పత్రాలు ప్రచురణ, సదస్సులు, చర్చాగోషులు, కార్యశాలలను నిర్వహిస్తుంటుందన్నారు. రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ లో సభ్యత్వం పొందిన డాక్టర్ కూరిని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ రాంబాబు గుండ్ల, పలువురు అధ్యాపకులు అభినందించినట్టు పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…