Telangana

జూన్ 20న పదవ తరగతి ప్రతిభావంతులకు పురస్కారాల పంపిణీ

500 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నెల 20వ తేదీన సైకిల్లు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు మంగళవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు పరీక్ష సామాగ్రి సైతం అందించడం జరుగుతోందని తెలిపారు. అదే విధంగా ఫలితాల్లో అత్యుత్తమ మార్పులు సాధించిన విద్యార్థులను సైతం ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం నగదు పురస్కారాలు పంపిణీ చేస్తున్నమని తెలిపారు. ఈ సంవత్సరం వినూత్నంగా సైకిళ్ళు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థినీ విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పటాన్చెరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

4 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

5 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

10 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

22 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

22 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

23 hours ago