సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, హైదరాబాద్ రీజియన్ లో నియామకం
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మైథిలి మారట్ అనూప్ ను, భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీ.బీ.ఎఫ్.సీ), హైదరాబాదు రీజియన్ సలహా మండలి సభ్యురాలిగా నియమించింది. సీ.బీ.ఎఫ్.సీ., హైదరాబాదు ప్రాంతీయ అధికారి డాక్టర్ రాహుల్ గౌలికర్ జారీచేసిన అధికారిక ప్రకటన ప్రకారం, డాక్టర్ మైథిలి మూడేళ్ల కాలానికి లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు, ఏది ముందు అయితే అది, సలహా మండలిలో సేవలందిస్తారు.డాక్టర్ మైథిలి మారట్ అనూప్ ఒక ప్రఖ్యాత ప్రదర్శన కళాకారిణి, విద్యావేత్త, పరిశోధకురాలు. ఆమె రెండు దశాబ్దాలకు పైగా భారతీయ శాస్త్రీయ నృత్యానికి, ముఖ్యంగా మోహినియాట్టానికి అంకితభావంతో సేవలందిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), దూరదర్శన్- రెండింటిలోనూ ప్యానెల్ సభ్యురాలిగా ఉన్న ఆమె, తన కళా నైపుణ్యానికి, పాండిత్యపరమైన కృషికి విస్తృత గుర్తింపు పొందారు.ఆమె విశిష్టమైన వృత్తి జీవితంలో అనేక ప్రశంసలు పొందిన ఏకపాత్రాభినయ నాటకాలు, నృత్య చిత్రాలు, ‘ప్రేమ్ రాక్స్ రస; పూతప్పాట్టు, దుశాల’ వంటి ప్రముఖ నాటకాలలో ప్రధాన పాత్రలు ఉన్నాయి. ప్రదర్శన కళల రంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా, తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆమెను ప్రతిష్టాత్మక ‘రుక్మిణి దేవి అరుండేల్ అవార్డు 2025’తో సత్కరించింది.తన కళాత్మక విజయాలతో పాటు, డాక్టర్ మైథిలి ఐఐటీ బొంబాయి నుంచి పిహెచ్.డి. పట్టా పొందారు. హైదరాబాదులోని గీతంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె రచయిత్రి కూడా. పరిశోధన, బోధన, సృజనాత్మక అభ్యాసం ద్వారా నృత్యం, నాటకం, సాంస్కృతిక అధ్యయన రంగాలను ఆమె రచనలు ముందుకు తీసుకువెళ్తున్నాయి.గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఇన్-ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ థరు, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ తదితరులు డాక్టర్ మైథిలి నియామకంపై హర్షం వెలిబుచ్చారు. ఇది విశ్వవిద్యాలయానికి, దాని విద్యా సమాజానికి (అకడమిక్ కమ్యూనిటీ) గర్వకారణమని వారు అభివర్ణించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు..! అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..! ప్రజల సొమ్ముతో చేసే పనుల్లో అవినీతి,…