Telangana

ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు, క్రీడా కేంద్రాలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే, ఉమ్మడి మెదక్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారుల కోసం కోచింగ్ కేంద్రాలు, క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు, ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పటాన్చెరు ఎమ్మెల్యే, అధ్యక్షులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపిక్ డే సందర్భంగా ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతి త్వరలో ఒలింపిక్ రన్, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్షేత్రస్థాయి నుండి క్రీడా పోటీలు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధి కోసం ఐదు మినీ స్టేడియాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మైత్రి మైదానం వేదికగా ఏడాది పొడవునా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు రఘునందన్ రెడ్డి, ఎల్లయ్య, హరికిషన్, బుచ్చిరెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

21 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

21 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

21 hours ago