పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
‘ అంతరించిపోతున్న భారతీయ కళల వేడుకలను ‘ సంస్కృతి ‘ పేరిట గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్చ్ఎస్ ) విద్యార్థులు సగర్వంగా నిర్వహించారు . తమ విద్యా సంస్థలోని విద్యార్థులు , అధ్యాపకులలో నిబిడీకృతంగా ఉన్న కళాకారులను కళ , కవిత్వం వంటి పోటీల నిర్వహణ ద్వారా వెలితీశారు . అంతేగాక , భారతీయ కళల స్థితిపై అభిప్రాయాలను తెలియజేయడానికి యువతకు వక్తృత్వం పోటీలను నిర్వహించారు . ‘ పొట్టి సినిమా ‘ ( షార్ట్ ఫిల్మ్ ) పేరిట నిర్వహించిన పోటీకి ఔత్సాహికులను ఆహ్వానించగా , దాదాపు 43 మంది భారీ భాగస్వామ్యంతో విశేష ఆదరణ లభించింది . కళల పట్ల యువతరానికి ఉన్న ఉత్సుకత , అభిరుచిలకు తార్కాణంగా నిలిచింది . హిట్వర్స్ సృష్టికర్త డాక్టర్ శెల్లేష్ కొలను , ప్రముఖ టాలీవుడ్ నటి శ్రీవిద్యా మహర్షి , పాత్రికేయురాలు ప్రేమమాలిని , గాయని లాలసలను సంస్కృతి వేదికపై సత్కరించారు . మొత్తంగా ఈ వేడుక శాస్త్రీయ ప్రదర్శనలు , అనుకరించలేని అద్భుతకమైన కళలకు వేదికగా నిలిచింది . మనదేశంలోని చేనేత కళాకారులకు మద్దతునిస్తూ విద్యార్థులు చేనేత దుస్తులు ధరించి ఈ వేడుకలలో పాల్గొనడం విశేషం .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…