National

కరోనా థర్డ్ వేవ్ వచ్చిన భయం లేదు..?

 

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9వేల 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 437 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో లక్ష11 వేల 481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 537 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ పై గుడ్ న్యూస్ చెప్పారు వైద్య నిపుణులు. మూడో వేవ్ వచ్చిన .. అది రెండో ఉద్ధృతి స్థాయిలో ఉండబోదని మాధానమిస్తున్నారు నిపుణులు. దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతుండటం వంటివి మూడో వేవ్ రాకుండా ఉండడానికి దోహదపడుతున్నాయని వారు తెలిపారు. కరోనా నుంచి కోలుకొని, తర్వాత టీకా కూడా తీసుకున్నవారిలో మిశ్రమ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతోందని.. అది కూడా మూడో ముప్పు నివారణలో అత్యంత కీలకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఇక మూడో వేవ్ కి సంబంధించి.. సోనీపత్‌లోని అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ గౌతమ్‌ మేనన్‌ స్పందించారు. శీతాకాలం సమయం కనుక.. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశముందని… కానీ రెండో వేవ్ స్థాయిలో పరిస్థితులు తీవ్రంగా ఉండబోవని స్పష్టం చేశారు. మరింత వేగంగా విస్తరించే వేరియంట్‌ పుట్టుకొస్తే తప్ప.. దేశానికి మూడో ముప్పు తప్పినట్లే అని ఆయన పేర్కొన్నారు

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

15 hours ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

15 hours ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago