National

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా రాజీవ్​ కుమార్​

మనవార్తలు , ఢిల్లీ :

దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా.. రాజీవ్​ కుమార్​ నియమితులయ్యారు. మే 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్​గా(సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్​ కుమార్​ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14తో ముగియనుంది. సుశీల్ చంద్ర స్థానంలో రాజీవ్‌ కుమార్ మే 15న పదవీ బాధ్యతలు చేపడతారు. ఏడాది వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 1984 బ్యాచ్‌ ఝార్ఖండ్​ క్యాడర్‌కు చెందిన రాజీవ్‌.. గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగానూ పనిచేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago