Telangana

హెచ్ సి ఏ లో మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యత్వానికి సహకరించండి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_హెచ్ సి ఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కు వినతి

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప‌టాన్ చెరుపట్టణానికి చెందిన మైత్రి క్రికెట్ క్లబ్ కు సభ్యత్వం అందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం హెచ్ సీ ఏ అధ్యక్షుడు మహమ్మద్ అజహారుద్దీన్ ను కోరారు. గతంలో ప‌టాన్ చెరు పరిధిలోని ఇక్రిసాట్ టీంకు హెచ్ సి ఏ సభ్యత్వం కలిగి ఉండేదని, చాలా రోజులుగా పోటీల్లో పాల్గొనలేకపోవడంతో వారి స్థానంలో మైత్రి క్రికెట్ క్లబ్ కు అవకాశం ఇవ్వాలని కోరగా, అందుకు యాజమాన్యం అంగీకరించిందని అజారుద్దీన్ కు తెలిపారు.రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించిన మేరకు అజారుద్దీన్ కలవడం జరిగిందని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ప‌టాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఉమ్మడి మెదక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago