19 లక్షల 85 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందనిపటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, ప్రమోద్ గౌడ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…