Hyderabad

గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ ….

గీతమ్ లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నెటివ్ ….

– సిస్టమ్స్ 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు

పటాన్ చెరు:

భారతీయ బహుళ జాతి కంపెనీ, ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సౌజన్యంతో గీతం డీమ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని స్కూల్ ఆఫ్ సైన్స్ లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్నిపాల్ ప్రొఫెసర్ జీ.ఏ.రామారావు బుధవారం పేర్కొన్నారు. టీసీఎస్ సహకారంతో ప్రారంభిస్తున్న ఈ కోర్సులో విద్యార్థులు కోర్ కంప్యూటర్ సైన్స్ లోనే కాకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన జ్ఞానాన్ని పొందే వీలుందన్నారు. అంతే కాకుండా, కాగ్నిటివ్ కంప్యుటేషన్ స్కిల్స్ తో పాటు డిజైన్ థింకింగ్, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నేర్పును అలవరచుకోవచ్చని తెలిపారు. ఐటీ / ఐటీ అనుబంధ సేవలు / ఐటీఐఎస్ కంపెనీలలో ఉత్పాదక వృత్తిని నెలకొల్పడానికి, ఉన్నత అధ్యయనాలకు దోహదపడతాయన్నారు. టీసీఎస్ తో కలిసి రూపొందించిన పాఠ్యాంశాల వల్ల విద్యార్థులు ప్రాక్టికల్ ల్యాబ్ అనుభవాలతో మిళితమైన ఐటీ మౌలిక సదుపాయాలతో కూడిన రంగాలను కూడా అర్థం చేసుకోవడానికి, సమగ్ర అవగాహన ఏర్పరచుకోవచ్చని ప్రిన్సిపాల్ వివరించారు. ఈ కోర్సులో భాగంగా పరిశ్రమ నిపుణులతో సమావేశాలు, సెమినార్లు, శిక్షణా సమావేశాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాల పెంపు, జట్టులతో కలిసి పనిచేయడం, వ్యక్తిత్వ వికాసం వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయన్నారు. ఇంటర్మీడియెట్ లేదా +2 ను (ఎంపీసీ) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, కంప్యూటర్ నైపుణ్యాలలో ప్రాథమిక జ్ఞానం ఉన్న విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులని డాక్టర్ రామారావు తెలిపారు. ఇతర వివరాల కోసం 9000 688 872 లేదా hydgss.gitam.edu ను సందర్శించాలని ప్రిన్సిపాల్ సూచించారు.

Venu

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

2 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

2 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

2 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

2 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago