_మే 19న వరంగల్‌లో బ్రైడల్ మేకప్ కాంపీటీషన్..
_ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టుల ప్రతిభను వెలికితీసే ప్రయత్నం..
మనవార్తలు,హైదరాబాద్:
మే 11 2022, హైదరాబాద్: బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ సీజన్ 3 పోస్టర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని ది పార్క్‌లో జరిగింది. వరంగల్‌లోని ఎఆర్ఆర్ గార్డెన్స్‌లో మే 19, 2022 ఈ పోటీ జరుగుతుంది. ప్రఖ్యాత తెలుగు నటి పాయల్ రాజ్‌పుత్ ఈ వేడుకకు హాజరవుతారు. మే 17న శిక్షణ సెషన్ ఉంటుంది. ఆసక్తి గల ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టులు రూ. 300 రుసుము చెల్లించి నిపుణుల నుండి కొత్త మెళకువలను నేర్చుకోవచ్చు. బ్రైడల్ మేకప్ పోటీకి ప్రవేశ రుసుము రూ. 1,500 ముల్తాయ్ ఫ్యాషన్ కార్నివాల్ (సీజన్ 2) పోస్టర్ కూడా ఈవెంట్లో లాంచ్ చేయబడింది. బ్రైడల్ మేకప్ పోటీని సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో హైదరాబాద్ నిర్వహిస్తుంది. మొదటి రెండు సీజన్‌లు హైదరాబాద్‌లో విజయవంతమవగా ఇప్పుడు మరో ఈవెంట్‌ను వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో వ్యవస్థాపకులు రాఘవి రెడ్డి మాట్లాడుతూ మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ హజరై, ఈ శిక్షణలోని నిపుణుల నుంచి కొత్త మెళుకువలను నేర్చుకోవచ్చన్నారు. నైపుణ్యం స్థాయిలను పెంచుకుంటూ పోటీరంగంలో మరింతగా రాణించవచ్చన్నారు. ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టులు తమ ప్రతిభను ప్రదర్శించి, మేకప్ పరిశ్రమలో కొత్త విషయాలను నేర్చుకుంటూ మరింతగా రాణించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు రేఖారావు, సుధాజైన్, జుహిచావన్ నటి చిత్రలేఖ, నటుడు రాజేష్, విజె రాకీ, పరీధా యూసఫ్, గబ్బర్ సింగ్ సినిమా బృందం ర్యాంప్ వాక్ తో సందడి చేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…