పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణం శాంతినగర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ దీపా దేవానంద్ గౌడ్ బోనాల పండుగను నిర్వహించారు. బోనాల పండుగలో భాగంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోనాల పండుగలో ఆనందంగా పాల్గొన్నారు. మేళ తాళాలతో, డప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి బోనం కుండను నైవేద్యముగా పోచమ్మ తల్లికి సమర్పించారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో విద్యాసంస్థ, విద్యార్థిని విద్యార్థులు అత్యంత ఉన్నత స్థితికి ఎదగాలని ప్రిన్సిపల్ దీపా దేవానంద్ గౌడ్ కోరుకున్నారు. అదేవిధంగా బాలికలు పట్టు బట్టలతో, బాలురు పట్టు పంచెలతో, కొంతమంది విద్యార్థులు పోతురాజు వేషధారణతో ఎంతో అందంగా కనిపించారు. ఆలయ ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రిన్సిపల్ దీపా దేవానంద్ గౌడ్ కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…