శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
రాబోయే రోజుల్లో బీజేపీ ని అధికారం లోకి రావడాని కార్యకర్తలoదరు కృషిచేయాలని బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీ నుండి గజ్జల యోగానంద్ సమక్షంలో నియోజకవర్గ బిజేపి నాయకులు విద్యా కల్పన, ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాఘవేందర్ రెడ్డి సింధు రెడ్డి నాయకత్వంలో 100 మందికి పైగా పార్టీ లో చేరిన వారికి గజ్జల యోగానంద్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున మహిళలు పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు, మహిళలు ఈసారి బిజెపి పార్టీ నీ గెలిపించడంలో ముందుంటారని అన్నారు. ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి సింధు రెడ్డి లను యోగానంద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, మహిళ నాయకురాలు పద్మారెడ్డి శోభా రెడ్డి డివిజన్ అధ్యక్షులు రాజిశెట్టి కురుమ, మేరీ సోలమన్, బీమని విజయలక్ష్మి, వినీత సింగ్, నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు భాను యాదవ్, జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు గణేష్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా సెక్రెటరీ అశోక్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.