మనవార్తలు ,మియాపూర్ :
గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు యోగనంద్ పాల్గొని మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి వందనాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేశంకోసం హిందు ధర్మంకోసం ఆయన సేవలు కొనియాడుతూ గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేశారు అని అన్నారు. కేవలం గిరిజనుల అభ్యున్నతి కోసంమే కాకుండా భారత సాంస్కృతి సంప్రదాయాలను కాపాడిన మహనీయులు అని కొనియాడారు.అలాగే సేవాలాల్ మహరాజ్ మానవ మాతృడు కాదు అని దైవంతా సంబుతులని అన్నారు. దేశ ప్రజలు ముఖ్యంగా యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.దేశం పట్లా ధర్మం పట్లా ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా అధ్యక్షులు తిరుపతి నాయక్, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్,దశరథ్, సీతారాం నాయక్,బీజేపీ సీనియర్ నాయకులు మణిక్ రావు, శ్రీధర్ రావు,విజేందర్,ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, రవీందర్ నాయక్,వినోద్,ప్రభాకర్, పాపయ్య,కళ్యాణ్,శ్రీను,వెంకట్,నాయకులు, తండా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…