బండి సంజ‌య్ కాన్వాయిపై దాడిని ఖండించిన _ బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు , పటాన్చెరు

రాష్ట్రంలో రైతాంగం ఇబ్బందుల్లో ఉన్నద్రుశ్య వరి కొనుగోలు కేంద్రాల్లో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిమీద టిఆర్ఎస్ నాయకుల దాడిని ఖండిస్తూ మంగళవారం ఇస్నాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు అనంతరం  శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ తన స్థాయిని మరిచి నీచ రాజకీయాలకు పాల్పడ్తున్నారని ఆరోపించారు.రాజకియంగ బీజేపీని ఎదుర్కోవడం చేత గాక ఇలాంటి చర్యలకు దిగజారుతున్నాడని ధ్వజమెత్తారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కుడా ఇలానే రెచ్చగొట్టి 1200 మంది ఆత్మబలిదానాలకు కారకులైన కేసీఆర్ కుటుంబ పాలన చేస్తు ఇప్పుడు టీఆర్ఎస్ గుండాలను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. ఇలాంటి దాడులకు బండి సంజయ్ గారు గాని బీజేపీ నాయకులు కాని భయపడరని, తెలంగాణ ప్రజానికానికి ఎక్కడ ‌సమస్య‌ ఉంటే అక్కడ బీజేపీ ప్రజలకు ‌అండగ నిలబడుతుందని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర బుద్దులు మానుకోని ప్రజాస్వామ్య పద్ధతిలో చేతనైతే రాజకీయంగా ఎదుర్కొవలని అలాగే రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించాలని హితవు పలికారు. తెలంగాణలో రాబోయే ఎలక్షన్స్ లో గోల్కొండ కోట మీద బిజెపి జెండా ఎగరడం కాయమని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పటాన్ చెరువు మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా సభ్యులు మధుకర్ రెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago