politics

సీఎం కేసీఆర్ ది కపట నాటకం – పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు:

ముఖ్యమంత్రి కేసీఆర్ ది కపట నాటకమని పటాన్‌చెరు మాజీ జడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ముత్తంగి బీజేపీ కార్యాలయంలో గడీల శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహా ధర్నా ఓక నాటకమని, అందులో కేసీఆర్‌ మహానటుడని విమర్శించారు.

రైతులపై కేసీఆర్‌ కపట నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న వడ్లు కొనకుండా తరువాత వాటిపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నా పేరుతో సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఓక అవకాశ వాది అని, ఇన్నాళ్ళు ఫాం హౌస్ లో ఉండి ఇప్పుడు బీజేపీ పట్ల పెరుగుతున్న జనం స్పందన చూసి ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తోచక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

ఇలా ధర్నాలు చేయాలనుకుంటే టీఆర్ఎస్ నాయకులు చేతనైతే ఈ ఏడున్నర ఏళ్ళుగా కేసీఆర్ హామిలిచ్చిన దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్ రూం, దళిత బంధు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇలాంటి వందలాది స్కీములపై చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేసినా ఘనత కేసీఆర్ కె దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, నాయకులు దేవేందర్ గౌడ్, శివా, సాయి తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago