56 మంది లబ్ధిదారులకు 30 లక్షల 47 వేల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ
పటాన్చెరు
ప్రజాసంక్షేమ పథకాల అమలులో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 56 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 30 లక్షల 47 వేల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి, కార్మిక బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో సి ఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయం లభిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో నియోజక వర్గాన్ని ముందంజలో నిలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, రైతు సమన్వయ సమితి పటాన్చెరు మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, నరసింహ, చెన్నా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…