Categories: Hyderabad

బీజేపీ ఎంపీ సోదరుడు… కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం

బీజేపీ ఎంపీ సోదరుడు… కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం
-దూకుడు రాజకీయాలకు రేవంత్ ప్రాధాన్యం
-కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్న నేతలు

హైదరాబాద్:

రేవంత్ అధ్యక్ష భాద్యతలు చేపట్టాక కాంగ్రెస్ లో కదలిక ప్రారంభమైందని అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కొన్ని మైనస్ లు కూడా లేక పోలేదు . రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహిరిస్తారనే దానిలో ఎలాంటి సందేహాలు లేవు . ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ ఉత్తర తెలంగాణ పర్యటనకు వెళ్లారు . నిజామాబాద్ లో మాజీ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్ రేవంత్ తో భేటీ అయ్యారు .అనంతరం తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. సంజయ్ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోదరుడు కావడం విశేషం …

తెలంగాణ రాజకీయాల్లో తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు బీజేపీ లో చేరగా ఇప్పుడు బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చేస్తున్నారు. . పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వారిలో నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోదరుడు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాలపల్లి బీజేపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు.
దీనిపై ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ… తాను కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగానని, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కోసమే టీఆర్ఎస్ లో చేరానని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు.
అటు, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్ష పదవిలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించడంలో సఫలమవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్ పుంజుకోవడంపై అంచనాలు బలపడుతున్నాయి.

Venu

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

8 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago