సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహా రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురిచేయడం వెనక బీజేపీ కుట్రదాగి ఉందని సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్ చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహా రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని బాబా సాహెబ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద మీనాక్షి నటరాజన్ పై అక్రమ కేసు ప్రతులను కొల్కురి నరసింహారెడ్డి తగలబెట్టారు. మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ బరిలో దిగగా …రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ ను తిరస్కరించారు .మోడీ ప్రభుత్వం తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటని అన్నారు. గతంలో బిజెపి ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించి ఓటు చోరీ చేసి గద్దెనెక్కిందన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్ర వివరాల ఇన్ ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నిక ప్రక్రియను అక్రమ కేసు పేరు తో అడ్డుకోవడం సిగ్గుచేటని అక్రమ కేసు ప్రతులను తగలబెట్టామని అన్నారు. జూన్ 18న రాజ్యసభ ఎన్నిక ఉన్నందున ఎన్నికల కమిషన్ వెంటనే మీనాక్షి నటరాజన్ ఎన్నికల్లో పోటీలో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్ సాయిలు ముదిరాజ్ ,కార్మిక సంఘం నాయకులు రాజు ,రతన్ సింగ్ ,వినోద్ ,రాము ,ప్రవీణ్ ,తదితరులు పాల్గొన్నారు
