– సహకార విస్తరణ ప్రణాళికపై చర్చ – గీతం కోర్సుల నిర్వహణ తీరుపై ప్రశంసలు
మనవార్తలు , పటాన్ చెరు:
తిమిటీ జె.లించ్ , అంతర్జాతీయ అసోసియేట్ డీన్ , మెల్బోర్న్ విశ్వవిద్యాలయం , ఆస్ట్రేలియా నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల బృందం శుక్రవారం హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ నేతృత్వంలో గీతం సెన్స్డ్ డీన్ ఎం.బాలకుమార్ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , భౌతిక రసాయన శాస్త్ర విభాగాధిపతులు ప్రొఫెసర్ రావూరి బాలాజీరావు , డాక్టర్ సురేంద్రబాబు , బీఎస్సీ బ్లెండెడ్ సమన్వయకర్తలు డాక్టర్ సాయిప్రీతి , డాక్టర్ శ్రీమన్నారాయణ , పలువురు అధ్యాపకులు వారితో ముఖాముఖి చర్చించారు . ముఖ్యంగా మెల్బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో మూడేళ్ళ క్రితం ప్రారంభించిన బీఎస్సీ బ్లెండెడ్ కోర్సును సమీక్షించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు , వాటిని అధిగమించాల్సిన తీరు వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు.
విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేసిన పరిశోధనలను ఆస్ట్రేలియా బృందానికి వివరించి , వారి ప్రశంసలందుకున్నారు . గీతం కోర్సుల నిర్వహణ తీరు తమకు చాలా నచ్చిందని , భారతదేశంలో ఏడు చోట్ల బీఎస్సీ బ్లెండెడ్ కోర్సుకు అనుమతివ్వగా , పూనే వర్సిటీతో పాటు గీతం పనితీరు , అధ్యాపకుల నిబద్ధత , విద్యార్థుల పురోగతి తమను ఆకట్టుకున్నట్టు ఆస్ట్రేలియా బృందం అభిప్రాయపడింది . త్వరలో డ్యూయల్ డిగ్రీ లేదా డబుల్ డిగ్రీ కోర్సును ప్రారంభిస్తామని , అది రెండేళ్ళు గీతమ్ , చివరి రెండేళ్ళు మెల్బోర్న్ పూర్తిచేయొచ్చని వారు చెప్పారు .
అలాగే పలు పరిశోధనా ( పీహెచీ ) కోర్సులను కూడా భారతీయ విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మలుస్తున్నా మన్నారు . ఆయా సెన్స్డ్ కోర్సులను చదివినవారు లోతుగా , సృజనాత్మకంగా ఆలోచించి , సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాలనేదే తమ అభిమతమని చెప్పారు . భారతీయ విద్యార్థులు సొంత డబ్బుతో కాకుండా , కొద్దిపాటి మొత్తంతోనే ఆస్ట్రేలియా వచ్చి చదువుకోవచ్చని , 20 శాతం సమయాన్ని పార్టెమ్ ఉద్యోగాల కోసం వెచ్చించవచ్చని , చదువుకుంటూనే సంపాదించి సొంత కాళ్ళపై నిలబడేలా ప్రోత్సహిస్తున్నామన్నారు . పూనే విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ మాధవరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…