మనవార్తలు ,పటాన్ చెరు:
గాలి కంటే తేలికెన ( లెటర్ దాన్ ఎయిర్ – ఎల్టీఏ ) వ్యవస్థలు స్థిరంగా ఉన్నప్పుడు కూడా ఎత్తులో ఉండగల సామర్థ్యం , తేలే శక్తి వంటి ప్రత్యేకతల కారణంగా ఏరోస్పేస్ సిస్టమ్స్ సముచిత స్థానాన్ని ఆక్రమించాయని ఐఐటీ బాంబే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్కుమార్ ఎస్.పంత్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ డిజెన్ అండ్ సెజింగ్ ఆఫ్ యాన్ ఇండోర్ ఎయిరిప్ ‘ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల కార్యశాల ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది . అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , ఏడాదిలోగా ఈ ప్రాంగణంలో ఎల్టీఏ వ్యవస్థను అభివృద్ధి చేసి , అమలులోకి తెస్తే ఈ వర్క్షాపు విజయవంతమైనట్టు భావిస్తానని ఆయన స్పష్టీకరించారు . ఎయిరిప్లు , ఏరోస్టాట్లు ఈ సాంకేతికత రెండు సూత్రాలని , ఇవి వేమానిక నిఘా , వెరైస్ కమ్యూనికేషన్ , ప్రోడక్ట్ ప్రమోషన్ వంటి అనేక పనుల కోసం పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటున్నట్టు ప్రొఫెసర్ పంత్ పేర్కొన్నారు .
ఎయిర్షిస్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణీకుల రవాణా , సరకు రవాణాలను తక్కువ ఖర్చుతో చేయవచ్చని , వాటికి పొడవైన రన్వేలు అవసరం లేదని . చాలా తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయని ఆయన వివరించారు . ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లే విద్యార్థులు స్కాలర్షిప్లు ఉంటేనే వెళ్లాలని ఆయన నొక్కిచెప్పారు . గీతం ప్రోగ్రామ్ డెరైక్టర్ ( రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ) ప్రొఫెసర్ కె.ఆర్.అనంత్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు . సెక్స్ట్స్ను అర్థం చేసుకోవడం చాలా సులువని , అయితే దానిని ఇంజనీరింగ్ గా మార్చడం సవాళ్లతో కూడుకున్నదని , అది వాణిజ్య కోణంలో చేయాలని చెప్పారు .
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య మాట్లాడుతూ , ప్రొఫెసర్ పంత్ వంటి వారి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు . తొలుత , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ వి . హిమబిందు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ సమన్వయకర్త ఎం.సత్యప్రసాద్ వందన సమర్పణ చేశారు . ఈ ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . బుధవారం వరకు ఈ కార్యశాల కొనసాగనుంది .
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…