Telangana

గీతం ప్రమాణ ఫిబ్రవరి 8-10న

_లోగో ఆవిష్కరణలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

_ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో ప్రతియేటా నిర్వహించే మూడు రోజుల సాంకేతిక, సాంస్కృ తిక, యాజమాన్య (టెక్నో, కల్చరల్, మేనేజ్మెంట్ ఫెస్ట్) పండుగ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు అలరించనున్నది. ఈ విషయాన్ని ఫెస్ట్ కన్వీనర్ డాక్టర్ సి.త్రినాథరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ ఫెస్ట్ ప్రచారంలో భాగంగా, నవీకరించిన లోగోను ఇటీవల ఆవిష్కరించినట్టు ఆయన తెలిపారు. ప్రమాణ లోగో ఆవిష్కరణ సందర్భంగా గీతం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు (శాస్త్రీయ, జానపద, సామూహిక నృత్యాలను) ప్రదర్శించినట్టు ఆయన పేర్కొన్నారు. ట్రయాడ్ బ్యాండ్ ప్రదర్శన ఈ ఉత్సవానికే తలమానికంగా నిలిచి, ఆహూతులందరినీ అలరించిందన్నారు.లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో దాదాపు 1500 మంది గీతం విద్యార్థులు చురుకుగా పాల్గొని, ప్రమాణ-2024 ఉత్సవ నిర్వహణ కోసం తమ ఉత్సుకతను ప్రదర్శించినట్టు డాక్టర్ త్రినాథరావు తెలియజేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని స్టూడెంట్ లెఫ్ట్ బృందం పర్యవేక్షించి, సమన్వయం చేసిందన్నారు.గీతం, హైదరాబాద్ సాంకేతిక, సాంస్కృతిక, మేనేజ్మెంట్ వేడుకల కోసం వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఒకచోట చేర్చి, ఆకర్షణీయమైన, మరపురాని ప్రమాణ 2024ని ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago