మనవార్తలు ,ఢిల్లీ:
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. దేశవ్యాప‍్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ”జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు. బెంజ్ కారు యజమాని ఎవరో చెప్పలేదు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్ చెప్పలేదు.
ప్రభుత్వ వాహనం అని స్టిక‍్కర్లు తొలగించింది ఎవరు?. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు. పాత్రదారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్ చెప్పడం లేదు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదు. వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారు” అని ప్రశ్నించారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…