Telangana

ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి

గీతం కాంక్లేవ్ లో అభిప్రాయపడ్డ పరిశ్రమ నిపుణులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులో వస్తాయని అంచనా వేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘భవిష్యత్తును ఇంజనీరింగ్ చేయడం: ప్రధాన రంగాలలో ఆవిష్కరణలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన మూడవ దఫా ఇండస్ట్రీ కాంక్లేవ్ విజయవంతంగా ముగిసింది.రానున్న రోజులలో ఉద్యోగ మార్కెట్ విస్తరిస్తూనే ఉంటుందని, అయితే ఏఐ ఆధారిత యుగానికి తగిన నైపుణ్యాలను విద్యార్థులు సమకూర్చుకోవాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఇంటర్న్ షిప్ లు, పరిశ్రమల సందర్శన, ఆచరణాత్మక అభ్యాసం ద్వారా తమ జ్జానాన్ని నిరంతరం మెరుగుపరచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, ముఖ్యంగా రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిన ఏఐపై పట్టు సాధించాలని ప్రోత్సహించారు. పరిశ్రమతో సహకారం, చురుకైన అభ్యాసం, సానుకూల దృక్పథం యొక్క ప్రాముఖ్యతను కూడా వారు నొక్కి చెప్పారు. సాంకేతిక నైపుణ్యాలు, జ్జానానికి మించి నియామకాలలో 75 శాతం విజయానికి ఆయా అభ్యర్థుల ప్రవర్తన, వైఖరి కారణమని వారు స్పష్టీకరించారు. కోర్ ఇంజనీరింగ్ కు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడంపై గీతం యాజమా న్యాన్ని అభినందించారు. దీనివల్ల పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య అంతరం తగ్గి అందరికీ మేలు జరుగుతుందున్నారు.

ఈ కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఎన్ఎక్స్ పీ సెమీకండక్టర్స్ లో ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అధిపతి ప్రీత్ యాదవ్, స్టెల్లాంటిస్ లో డెలివరీ లీడ్ సుమన్ గోర్లా ముఖ్య అతిథులుగా పాల్గొని, కీలకోపన్యాసాలు చేశారు. కోర్ ఇంజనీరింగ్ రంగాల భవిష్యత్తును రూపొందించడంలో ఆవిష్కరణ, పరిశ్రమ-విద్యా సంస్థల సహకారం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను వారు ప్రధానంగా ప్రస్తావించారు.ఇండస్ట్రీ కాంక్లేవ్ లో భాగంగా, ప్రముఖ పరిశ్రమ నిపుణులతో మూడు ప్యానెల్ చర్చలు జరిగాయి. ‘పారిశ్రామిక భవిష్యత్తును నడిపించడం: శక్తి, చలనశీలత, తయారీ’ శీర్షికన జరిగిన తొలి ప్యానెల్ చర్చలో యాక్సిస్ ఎనర్జీ మానవ వనరుల విభాగాధిపతి వీణ పుత్రేవుల; ప్రజ్ ఇండస్ట్రీస్ డీజీఎం యోగేష్ ఖటాలే; ఓడీఎఫ్ డీజీఎం కె.సి. మోహన్; అల్ట్రాటెక్ అధిపతి (ఆపరేషన్స్-సెల్స్) ఎన్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. దీనిని మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయ ప్రకాష్ శ్రీవాస్తవ సమన్వయం చేశారు.

‘వ్యూహాత్మక మార్పు: హార్స్ పవర్ నుంచి కంప్యూట్ పవర్’కు అనే అంశంపై నిర్వహించిన రెండో ప్యానెల్ చర్చలో డ్రోనవేషన్ ఇండస్ట్రియల్ ఏఐ డ్రోన్ సీఈవో డాక్టర్ సౌరభ్ శ్రీవాస్తవ; ఎంఓసార్ట్స్ సీటీవో డాక్టర్ ఎ. కృష్ణకాంత్; అనలాగ్ పోర్ట్ లో అనలాగ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ వై. షమీర్; బాష్ ఫంక్షనల్ ఎక్సలెన్స్ లీడ్ వంశీ మగపు; గ్లోబల్ ఫౌండ్రీస్ ఎస్ఎంటీఎస్ డిజైన్ ఇంజనీర్ ప్రియాంకర్ మాథురియా పాల్గొన్నారు. దీనిని గీతం బీటెక్ (ఈఈసీఈ) మూడో ఏడాది విద్యార్థిని పర్ణిక సురేష్ సూరిసెట్టి సమన్వయం చేశారు.‘సాంకేతిక నైపుణ్యాలకు మించి సామర్థ్యాలను పెంపొందించడం: కోర్ ఇంజనీరింగ్ లో అవకాశాలు’ శీర్షిక జరిగిన మూడో ప్యానెల్ చర్చలో బాష్ యూనివర్సిటీ రిలేషన్స్ ప్రణీత్ సరన్; స్టెల్లాంటిస్ లోని టాలెంట్ అక్విజిషన్ లీడ్ నిషితా రాయ్ పాల్గొనగా, సీజీసీ ప్రతినిధి ఎల్. వంశీకృష్ణ సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా ప్యానలిస్టులు గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని అత్యాధునిక ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలను సందర్శించారు. అధునాతన అభ్యాసం, పరిశోధనలకు మద్దతుగా ప్రపంచ స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేసినందుకు విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని వారు అభినందించారు.తొలుత, గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు స్వాగతోపన్యాసం చేయగా, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి సూచించారు. సీజీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.వాసుదేవ్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో సీజీసీ డైరెక్టర్ డాక్టర్ కె. మమతారెడ్డి, కోర్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

16 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

16 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

16 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

16 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago