Telangana

శాండ్విక్ పరిశ్రమలో సిఐటియు ఘనవిజయం

హెచ్ఎంఎస్ పై 131 ఓట్లతో భారీ విజయం

మరోసారి విజయకేతనం ఎగురవేసిన కార్మికుల వేగు “చుక్క”

కార్మిక శ్రేయస్సే సిఐటియు లక్ష్యం

ఈ విజయం మరింత బాధ్యతను పెంచింది

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

కార్మిక వర్గానికి దిక్సూచిగా నిలిచిన శాండ్విక్ పరిశ్రమ లో సిఐటియు ఘన విజయం సాధించింది. పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమలో శుక్రవారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సిఐటియు, హెచ్ఎంఎస్ పై 131 ఓట్ల భారీ విజయం సాధించి మరోసారి స్వగర్వంగా విజయకేతనం ఎగురవేసింది కార్మికుల వేగుచుక్క సిఐటియు సీఐటీయూ తరఫున సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు. హెచ్ఎంఎస్ తరపున విశ్వ ప్రసాద్ బరిలో ఉన్నారు.పరిశ్రమలో మొత్తము 186 ఓట్లు గాను సిఐటియుకు 157,, హెచ్ఎంఎస్ కు 26 ఓట్లు రాగ 2 ఓట్లు వేయలేదు. హెచ్ఎంఎస్ పై సిఐటియు 131 ఓట్లతో భారీ విజయం సాధించింది. ఈ సందర్భంగా పరిశ్రమ లోపలి నుంచి జాతీయ రహదారి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికులు రంగులు పూసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ విజయోత్సవం జరుపుకున్నారు.


ఈ విజయం కార్మికుల విజయం

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ పరిశ్రమ విజయం కార్మికుల విజయమని, విజయం మరింత బాధ్యతను పెంచిందని, ఇది కార్మికుల విజయంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు అభివర్ణించారు. కార్మిక వర్గాన్ని చీల్చటానికి ఎన్ని కుయుక్తులు పన్నిన కార్మిక వర్గం ఐక్యంగా నిలిచి కుట్రలను పటాపంచలు చేస్తూ మరోసారి చారిత్రాత్మక విజయనందించారని కొనియాడారు. కార్మికులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనేది ఈ శాండ్విక్ విజయమే ఒక నిదర్శనం అన్నారు. ఈ విజయంలో పాలు పంచుకున్న కార్మికులందరికీ ఈ విజయం అంకితం చేస్తూ కార్మికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలోనే చారిత్రాత్మక విజయమని పరిశ్రమంలో గత 41 సంవత్సరాలుగా కార్మికుల కోసం చట్టపరమైన సౌకర్యాలు సాధించుకుంటూ జిల్లాలోని మిగతా యూనియన్లకు ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. వివిధ పరిశ్రమల కార్మిక సంఘం నాయకులు చుక్క రాములకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్మిక వర్గానికే దిక్సూచి గా నిలిచిన సిఐటియు భారీ విజయంతో పరిశ్రమలో కార్మికుల సంబరాలు అంబరాన్నంటాయి. కార్మిక వర్గాన్ని చీల్చే విధంగా ఎన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ సిఐటియు విజయకేతనం ఎగరవేసింది. ఈ విజయంతో పరిశ్రమలో కార్మికులు విజయోత్సవంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి, జనరల్ సెక్రెటరీ మనోహర్, ఆఫీస్ బేరర్స్ సత్తిబాబు, వీర రావు, సదాశివరెడ్డి, వెంకట్రావు, కమిటీ సభ్యులు, వివిధ పరిశ్రమల యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago