Telangana

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..

పటాన్ చెరుఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాలని మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశించారు.శనివారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఐదు మున్సిపాలిటీల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయల చొప్పున 75 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో పాటు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కావచ్చిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రతి వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాలని కోరారు. అతి త్వరలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు స్థానిక పరిశ్రమల యాజమాన్యాలు, బిల్డర్ల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వంద శాతం పన్నులు వసూలు చేయాలని కోరారు.రాష్ట్ర రాజధానికి సమీపంలో ఐదు మున్సిపాలిటీలు ఉండటం మూలంగా శాంతిభద్రతలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుతో పాటు ముఖ్య కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కమిషనర్లను ఆదేశించారు. అభివృద్ధి పనుల రూపకల్పన, నిధుల కేటాయింపులు, ఖర్చుల్లో పూర్తి పారదర్శకత అవలంబించాలని సూచించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్లు కుమార్ గౌడ్, జనార్ధన్, సుష్మ, ప్రమీల, సుమలత, కమిషనర్లు దశరథ్, వెంకటరామయ్య, తిరుపతి, అజయ్ రెడ్డి, వెంకట కిషన్, వైస్ చైర్మన్లు సంధ్య గోవర్ధన్ రెడ్డి, మహేందర్ గౌడ్, హరీష్ రెడ్డి, డిఈ వెంకటరమణ, కౌన్సిలర్ అంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago