పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం
మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
ఏసుక్రీస్తు బోధనలు విశ్వ మానవ సమానత్వానికి దోహదం చేశాయని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని శనివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ జీసస్ ద్విచక్ర వాహనాల ర్యాలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, అనురాగం ఆప్యాయతో మెలగాలని క్రీస్తు తన బోధనల ద్వారా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. నియోజకవర్గంలో నూతన చర్చిల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, నర్రా బిక్షపతి, పృథ్వీరాజ్, వెంకటేష్, నరేష్, జీవన్, వివిధ క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…