మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :
భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను పటాన్‌చెరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం విగ్రహాలకు దండలు వేయడం మాత్రమే కాకుండా, మహానీయుల ఆశయాలను యువతకు చేరువ చేయాలని కోరారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలు పేదలకు ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడే మరో అంబేద్కర్, మరో జగజీవన్ రామ్ ఈ సమాజంలో ఉద్భవిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రుద్రారం శంకర్ అడ్వకేట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…