– విద్యా హై స్కూల్ లో అగ్నిమాపక పోలీసులు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
ఏవైనా అగ్నీ ప్రమాదాలు సంభవించినపుడు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని మాదాపూర్ ఫైర్ సేఫ్టీ అధికారులు అంజయ్య నగర్ లోని విద్యా హై స్కూల్ లో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు, స్కూల్ సిబ్బంది కి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమర్జెన్సీ ఎగ్జైట్ నుండి ఎలా తప్పించుకోవాలి, లిఫ్ట్ వాడకుండా మెట్ల మార్గం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎలా బయట పడాలో అధికారులు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. అధైర్య పడకుండా తాము తప్పించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ఎలా రక్షించాలో, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే విషయాన్ని చక్కగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ, మాదాపూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్: డి.ఆంజనేయులు,, స్టేషన్ ఆఫీసర్ పి.అమరేందర్, కిషోర్ కుమార్, దేవేందర్, సూర్యప్రకాష్, టీమ్, మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…