Telangana

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని, చిట్కుల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను ఎదుర్కొని దేశ ఉప ప్రధాని స్థాయికి ఎదిగిన బాబుజీ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న వివక్షను రూపుమాపేందుకు ఆయన పార్లమెంటు లోపల, బయట నిరంతరం శ్రమించారని గుర్తుచేశారు.

సామాజిక న్యాయం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడటంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు.దేశం కరువు కాటకాలతో అలమటిస్తున్న తరుణంలో, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ చూపిన చొరవ అద్వితీయమని మధు ముదిరాజ్ కొనియాడారు. శాస్త్రవేత్తలను ప్రోత్సహించి, ఆధునిక సాగు పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని ‘అన్నపూర్ణ’గా మార్చిన ఘనత ఆయనదేనని అన్నారు.

హరిత విప్లవం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన వేసిన పునాదులే నేడు దేశాన్ని ఆహార భద్రతలో అగ్రగామిగా నిలబెట్టాయని స్పష్టం చేశారు.బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నిజం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అణగారిన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం ఇందిరా గాంధీ హయాం నుండి నేటి వరకు కాంగ్రెస్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల వెనుక బాబుజీ ఆలోచనా విధానం ఉందని ఆయన గుర్తు చేశారు. కుల మతాలకతీతంగా, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేయడమే ఆ మహనీయుడికి మనం ఇచ్చే అసలైన గౌరవమని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago