ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో 60 లక్షల రూపాయల నిధులతో నాలుగు అదనపు తరగతి గదులు నిర్మించబోతున్నట్లు పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ముత్తంగి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో గల గదులు శిథిలావస్థకు చేరుకోవడం మూలంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు గతంలో తమ దృష్టికి తీసుకొని వచ్చారని ఆయన తెలిపారు. అమెరికాకు చెందిన మెడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు 60 లక్షల రూపాయలతో తరగతి గదులు నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. రాబోయే కొద్దిరోజుల్లోనే పనులు ప్రారంభించి.. తరగతి గదులను అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పారు. గదుల నిర్మాణానికి ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు నాయక్. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నరసింహారావు, మేరాజ్ ఖాన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…